అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత గ్రేటర్ ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ ఎక్కడా గ్రేటర్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు. గ్రేటర్ బరిలో తాను ప్రచారం చేపడతానని కూడా ప్రకటించలేదు. దీంతో పవన్ హైదరాబాద్ లో బీజేపీ తరపున ప్రచారం చేపట్టే అంశంపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. పవన్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయరనే విషయం తేలిపోయింది.