బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వచ్చే వర్షాకాల సమయానికి 100 శాతం ఎవరి ఇళ్లలోకి నీళ్లు రాకుండా పునరుద్ధరిస్తాం. అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. టీఆర్ఎస్ బోట్లు కావాలా.. వరద నీరు రాకుండా పునరుద్ధరణ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పథకం అయినా కేంద్ర ప్రభుత్వ సహకారం, అండ లేకుండా అమలవడం అసాధ్యం.