జాతీయ స్థాయిలో ఇటీవల పలు పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ తాజాగా మరో అరుదైన రికార్డు అందుకుంది. మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్ శాఖ తెచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ 11 లక్షల డౌన్ లోడ్స్ ను అధిగమించి రికార్డు సృష్టించింది.