జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సాధారణంగా ఉండే సీసీ కెమేరాలు, పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసే వెబ్ కాస్టింగ్ కెమేరాలతో పాటు ఈ సారి 200 బాడీ వార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగిస్తారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతుండటంతో.. ఎలక్షన్ బూత్ లలో గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో బాడీవార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగిస్తున్నారు.