గ్రేటర్ ఎన్నికల ఫలిత ప్రభావం నేరుగా అసెంబ్లీపై పడుతుందని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అందుకే గెలుపుకోసం ఇంతగా ఆసక్తి చూపుతున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో షాక్ తిన్న అధికార పార్టీ కూడా ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పోలేదు అన్న విషయంపై ఓ క్లారిటీ ఇవ్వాలి అంటే .. గ్రేటర్ ఎన్నికలు ఎంతగానో సహాయపడతాయి అందుకనే ఇంతగా ఆసక్తి కనబరుస్తున్నాయి.