జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మత విద్వేషపూరిత వ్యాఖ్యాలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాగంగా నేరచరిత్ర కలిగిన కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా ఈ కుట్రలకు పాల్పడుతున్నారని, ఈ కుట్రలకు ప్రయత్నిస్తున్న వారి గురించి పక్కా సమాచారం ఉందన్నారు.