తెలంగాణాలో గ్రేటరెన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచింది. మేనిఫెస్టో ల హామీలతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పార్టీ లు ఇప్పుడు ప్రచారంలో తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు.. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గరకొస్తుండడంతో అన్ని పార్టీ తమదే గెలుపు అని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా దెబ్బకు ఓటమితో కేసీఆర్ ఇక్కడ గెలిచి ఆ ఓటమి బాధను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అయన ఈ ఎన్నికలను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.