హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన తర్వాత ఇది ఎనిమిదో ఎన్నిక. ఇప్పటి వరకూ ఏడుసార్లు బల్దియాకి ఎన్నికలు జరిగాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు ఇవి. 1956లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ఏర్పడింది. అప్పటి నుంచి 1960 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఎంసీహెచ్ ఉంది. 1960లో మొదటిసారి బల్దియాకు ఎన్నికలు జరిగాయి. 2020లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు బల్దియాకు ఎనిమిదో సారి వచ్చాయి.