టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలను ప్రతి ఏడాది గౌరవ ప్రదంగా ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, మరో పార్టీ దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్లకు భారతరత్న ప్రకటించకుండా, జీహెచ్ఎంసీలో ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదని చెప్పారు.టీఆరెఎస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..