ఆంధ్రప్రదేశ్ లో కరోనా  మరణాలు కూడా చిన్నగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారి బారిన పడి కేవలం ఆరుగురు మాత్రమే మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మాత్రమే కరోనాతో మరణించడం విశేషం అని చెప్పాలి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,976కు చేరింది.అలాగే డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గిపోయాయి.  శుక్రవారం 1,205 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,47,325 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 12,137 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 99,13,068 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో తెలిపింది.