ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి కోలుకోలేని షాక్ ఇవ్వటం జరిగింది. విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. కాపులుప్పాడ కొండపై అతిథి గృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ... అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు హైకోర్టు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై ఈ రోజు అనగా శుక్రవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం విచారణ జరిపడం జరిగింది. ఈ విచారణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో పిటిషనర్ జేఏసీ నేత గద్దె తిరుపతి రావు తరఫున ప్రముఖ న్యాయవాది అయిన మురళీధర్ వాదనలు వినిపించడం జరిగిందని స్పష్టమైంది. గ్రే హౌండ్స్కు ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని న్యాయవాది మురళీధర్ ప్రశ్నించారు. గ్రే హౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇంకా వారం రోజుల్లో ఎలాగైనా సరే ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం జరిగింది.