గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపుకోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం గెలుపుకోసం ఒకరితో ఒకరు లాలూచీ పడుతున్నారు. అలా టీఆర్ఎస్, బీజేపీ రెండూ లాలూచీ పడ్డాయని, అక్రమంగా లోపాయికారీ పొత్తు పెట్టుకుని పైకి మాత్రం శత్రువుల్లా నటిస్తున్నాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. బీజేపీ టీఆర్ఎస్ను కాపాడితే... టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తుందని అన్నారు. ఇద్దరిదీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని మరోసారి విమర్శించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేసినా.. అభివృద్ధి జరగదని కుండబద్దలు కొట్టారు.