మైండ్ గేమ్ ఆడి వైరి పక్షాలను ఇరుకున పెట్టడంలో బీజేపీది అందెవేసిన చేయి. అందులోనూ మోదీ-అమిత్ షా జోడీ అలా ప్రత్యర్థులను ఇరుకున పెట్టి రాజకీయ చాణుక్యుల్లా పేరు గడించారు. అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా మారిన తర్వాతే బీజేపీ ప్రభ అన్ని రాష్ట్రాల్లో విలిగిపోయింది. ఇప్పుడు జేపీ నడ్డా జమానాలో కూడా ఆ విజయాలను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. దానికి అనుగుణంగానే నడ్డా కూడా పావులు కదుపుతున్నారు. గ్రేటర్ విజయంతో తన సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నారు.