గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ.. అభ్యర్థులు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఖర్చుకి వెనకాడకుండా ఇతర జిల్లాల నాయకుల్ని తీసుకొచ్చి ఓటర్లను చేజారకుండా చేస్తున్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటునీ చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా అన్ని పార్టీలు వివిధ జిల్లాల నుంచి తమ కేడర్ ను తీసుకొచ్చాయి. అందర్నీ తీసుకొచ్చి నగరంలో మోహరించాయి.