జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5600 కోట్ల మేర ఉంటుంది. ప్రతి ఏటా ఈ నిధులు కూడా సరిపోక పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. ఈ దశలో పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇంతకు 10, 20 రెట్లు అదనపు నిధులు అవసరం. మరి గ్రేటర్ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు హామీలిచ్చాయా లేక... కేవలం ఓట్లకోసమే హామీలు గుప్పించారా అనే విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలి.