మజ్లిస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్ లు అమ్ముడు పోయారు.అందుకే రాష్ర్టంలోని హిందువులపై ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అంటూ మండి పడ్డారు..ఆ పనికి పోలీసులు కూడా వత్తాసు పలకడంతో గొడవలకు ఆద్యం పోసుకుంటున్నాయి..ఇలాగైతే ఢిల్లీ నుంచి పారా మిలటరీ బలగాలు దిగుతాయి అని ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. రాజేంద్రనగర్ డివిజన్లోని బుద్వేల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మార్చిలో జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికలను దుబ్బాక భయంతో డిసెంబరులోనే పెడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తధ్యం.. దాంతో పార్టీలో ఎవ్వరూ ఉండరు అంటూ జోస్యం చెప్పారు అర్వింద్..