శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుని.. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి.. 10 నుంచి 11.30 గంటల వరకు తుఫాను కారణంగా మూడు జిల్లాల్లో జరిగిన భారీ నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు జగన్ . అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. వర్షాలు ఎక్కువుగా వున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు మంచిగా సూచించారు. తుఫాను తగ్గేవరకూ ఇంట్లోనే జాగ్రత్తగా వుండాలని చెప్పారు.