ఈస్ట్ గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో వైసీపీ నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అని బాగా తిట్టుకున్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వెంటనే అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దర్ని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.