జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున రీయింబర్స్మెంట్ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేసింది. ఈ సందర్బంగా నాబార్డు డీజీఎం వికాశ్ భట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఇంకా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. వచ్చే నెల అనగా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవి జమ అవుతాయని తెలుస్తుంది.. రూ.2,234.288 కోట్ల రీయింబర్స్మెంట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది.