స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఇకపై ప్రకటన విడుదలైన రోజు నుంచి 14 రోజుల్లోనే పూర్తి చేయనున్నారట. ఈ సందర్బంగా పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు.దీనికి సంబంధించిన బిల్లును ఈనెల 30 నుంచి నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో మొదలపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది.ఇక ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు 2013వ సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలను ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించటం జరిగింది.