ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే రేసులో కోవిషీల్డ్ ముందువరుసలో ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సహకారంతో సీరం సంస్థ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయి.