సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్లో హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తుందని హెచ్చరించారు.