ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ పేరు తీయడంతో ఆ వీడియో వైరల్ అయింది. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారంటూ ఆమె సందేశమివ్వడం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్ని కాదు.. ఫైటర్ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియా లో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.