సోమవారం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకే సోమవారం ఉదయం 8 గంటలకు బీఏసీ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ భేటీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ప్రవేశ పెట్టే బిల్లులు, తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతలు చర్చించుకోవడం జరుగుతుంది.