కరోనా వైరస్ నిర్మూలన విషయంలో జగన్ మంచి ఘనత అందుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గిపోయాయి. అలాగే జగన్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కోటి మందికి పైగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రభుత్వం మరో శుభవార్త కూడా అందించింది. ఆదివారం భారీ సంఖ్యలో డిశ్చార్జిలు అవ్వడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8 వేలకు తగ్గిపోయింది. ఆదివారం కొవిడ్ 19 టెస్టులు భారీగానే నిర్వహించినా, కేసులు మాత్రం అత్యల్ప స్థాయికి తగ్గిపోయాయి. మరణాలు సైతం తక్కువగానే నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,67,683కి చేరింది.