కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాతబస్తీకి చేరుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని అమిత్ షా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం కోసం ఉదయం నుంచే వేచి ఉన్నారు.