గ్రేటర్ ప్రచారం ముంగింపు పర్వానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బీజేపీ అభ్యర్థుల తరపున ర్యాలీ చేపట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అదే సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు భయపడుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తామంటూ అమిత్ షా చెప్పడంతో కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు తమకు ఉట్లో పడవేమోనని ఆందోళనకు గురయ్యారు.