గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు బాగా ప్రచారం చేశారు. గ్రేటర్ లో ఖాతా తెరిస్తే చాలు అనుకుంటున్న టీడీపీ నేతలు.. ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ బలం పుంజుకుంటారు. చంద్రబాబుపై కూడా తెలంగాణ నేతలు ఓ దశలో ఒత్తిడి తెచ్చారట. బాబు వస్తే కాస్తో కూస్తో అభ్యర్థులకు ధైర్యం వస్తుందని, ఓట్ల శాతం పెరుగుతుందని అడిగారట. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. చివరి రోజు కూడా ఆయన కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారు కానీ బహిరంగ ప్రచారానికి వెళ్లలేదు.