ప్రధాని మోదీకి ఓ లాజికల్ ప్రశ్న సంధించారు కేటీఆర్. బీహార్ అసెంబ్లీ ప్రచారంలో ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్ మెంట్ ని ఓసారి గుర్తు చేశారు కేటీఆర్. "ప్రధాని మోదీ బీహార్లో మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం (డబుల్ ఇంజిన్) ఉంటేనే అభివృద్ధి అని చెప్పారు. బీజేపీ ఢిల్లీ పార్టీ. మాది గల్లీ పార్టీ. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే జీహెచ్ఎంసీలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కి జీహెచ్ఎంసీలో కూడా అధికారం ఇవ్వాల"ని ప్రజల్ని కోరారు.