ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ వారు యథావిధిగా చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేసి ముందుకెళ్లినట్లే కనిపించింది. అధికార పార్టీ నేతలు బాబుపై ఓ రేంజ్లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ సైతం బాబుని ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఇవి చూసి తట్టుకోలేని బాబు, అసెంబ్లీలోనే బైఠాయించిన సీన్స్ కనిపించాయి. అయితే అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా...తాజాగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.