ఏపీలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు ఇటీవల పార్టీలో పదవులని భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఎక్కువ పదవులు నేతలకు కేటాయించారు. అయితే ఈ పదవుల పంపకంలో చంద్రబాబు కొందరు సీనియర్ నేతలకు ఊహించని షాక్‌లు ఇచ్చారు. కొంతమందికి సరైన పదవులు కేటాయించలేదు. ఒకవేళ వారికి పదవులు ఇవ్వకపోయినా వారి వారసులకు సైతం ఎలాంటి పదవి కట్టబెట్టలేదు.