ఏపీలో ఒక పవర్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగన్ మాత్రమే...తిరుగులేని మెజారిటీతో అధికారంలో జగన్కు రాష్ట్రంలో ఏ నాయకుడు లేని విధంగా ప్రజలు మద్ధతు ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక తనకు మద్ధతుగా ఉన్న ప్రజలకు జగన్ తన పాలనలో ఎలాంటి వరాలు అందిస్తున్నారో కూడా తెలిసిందే. గతంలో చంద్రబాబు మాదిరిగా మాటల మనిషి అనిపించుకోకుండా, చేతల మనిషి అనిపించుకుంటున్నారు.