గ్రేటర్ ఎన్నికలకు మరి కొన్ని గంటలే ఉంది. ఇప్పటికే పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, టీడీపీతో చిన్నాచితక పార్టీలు గ్రేటర్ బరిలో ఉన్నాయి. అయితే ఇన్ని పార్టీలు ఉండటం వల్ల ఎవరి ఓట్లు ఎలా చీలతాయో అర్ధం కాకుండా ఉంది. ఇక ఈ ఓట్ల చీలిక తమకు ఎలాంటి నష్టం తీసుకురాకూడదని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు వేసుకుని ముందుకెళ్లింది.