గ్రేటర్ హైదరాబాద్ లో గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చాలా సాఫీగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసింది. నిన్నటితో వివిధ రకాల పార్టీల ఎన్నికల ప్రచారాలు ముగిసాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఈసారి ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈవీఎం ద్వారా ఓటు వేస్తున్న ఓటర్లు బ్యాలెట్ పద్ధతిని మరచిపోయారనే స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా.. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేటప్పుడు అధికారులకు పోలింగ్ స్లిప్‌తో పాటు 21 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి.