గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటంలో మొదలు కాబోతోంది. మహా కార్పోరేషన్ మీద కూర్చునే కొత్త పెత్తందారు ఎవరో కానీ మూసి ఉన్న ఆ పిడికిలీ నుంచి ఏ అలికిడీ లేదు. ఏ ఆనవాళ్ళూ కానరావడం లేదు. అంతా తుఫాన్ ముందర నిశ్శబ్దం. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.