గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు సంబంధిత శాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.