జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగు సినీ పరిశ్రమ మద్దతు టీఆర్ఎస్ కే అని తెలుస్తోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎక్కువగా సినీ రంగానికి వరాలు కురిపించడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సినీరంగ పెద్దలకే కాదు, కార్మికులకు కూడా మేలు చేసే పలు అంశాలు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నట్టు సినీ వర్గ ప్రముఖులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సినీ రంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ప్రజలంతా తమను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు సూచించారు.