ఏపీలో మళ్ళీ రంగుల రాజకీయం మొదలైంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముద్ర ఉండేలా చూసుకుంటారు. గతంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం అదే విధంగా చేసింది. రాష్ట్రంలో పసుపు కలర్ ఎక్కువగా కనిపించేలా చేసింది. ప్రతి పథకం, ప్రతి నిర్మాణంపై టీడీపీ ముద్ర ఉండేలా చూసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ కూడా టీడీపీ కంటే ఎక్కువగానే తన ముద్ర ఉండేలా చూసుకుంది.