ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబుని పక్కనబెట్టి, జనం జగన్ని గెలిపించారు. జగన్కు భారీ మెజారిటీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రజల అండ కూడా గట్టిగానే ఉంది.