హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ.. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా అంటూ అందరిలో చైతన్యం పెంచడానికి పూనుకున్నాడు. ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు. అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘‘ఇంత సాఫ్ట్‌గా చెబితే జనాలు మాట వినరు అన్న’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.