అసలుకే ప్రజలు GMSC ఎన్నికలో పాల్గొనడం చాలా అరుదు అలాంటిది , లాక్ డౌన్ సమయం రావడం వల్ల ప్రజలు ఇంకా బద్దకస్తులు అయ్యారు, ఏం ఓటేస్తాంలే అని నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.ఎందరో ప్రముఖులు ముందుకి వచ్చి ప్రజల్లో చైతన్యం నింపడానికి చాలా సూచనలు చెప్పారు. ఎన్నో నినాదాలు, ఎందరో సెలబ్రిటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు గత కొన్నిరోజులుగా ఓటు వేయండి అంటూ మొత్తుకుంటున్నారు. అయినా కూడా ఇవ్వన్ని గ్రేటర్ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రేటర్ పోరులో తమ బద్దకాన్ని ప్రదర్శించారు. ఇళ్ల నుంచి కదిలి ఓటు కోసం పోలింగ్ బూతు వరకు రాలేకపోయారు.