గ్రేటర్ లో పోలింగ్ ముగిసింది.గ్రేటర్ ఎన్నికల్లో మలక్పేట సర్కిల్ పరిధిలోని డివిజన్లలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, పార్టీల అభ్యర్ధులు మంగళవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్లోని సెయింట్ మేరీలో హైస్కూల్లో బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ఓటు వేశారు.