...గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు చాలా ఉత్కంఠంగా జరుగుతున్నాయి. మొన్నటి దాకా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి . ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు సరైన వారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు విజయశాంతి. హైదరాబాదును, తెలంగాణను కాపాడుకోవడం ప్రజల చేతిల్లోనే ఉందని ఆమె అన్నారు. అందుకే మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆమె ప్రజలకు అన్నారు. మరోవైపు ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది