గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మొన్నటిదాకా వివిధ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఇక ఇప్పుడు ఎగ్జిట్ పోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు పలుచోట్ల గొడవలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. కూకట్ పల్లి 121 డివిజన్ దీన బంధు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూతు నెంబర్ 48 వద్ద జగద్గిరి గుట్ట సిఐ బూటు కాళ్లతో పోలింగ్ బూతు టేబుళ్లను తన్నాడు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలను బూతు పదజాలంతో దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూకట్పల్లి దీనబంధు కాలనీలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.