పురానాపూల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని.. వీటన్నింటిలో రీ-పోలింగ్ నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి సిటీ కాలేజీలోని డీఆర్సీ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. చార్మినార్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్, పురానాపూల్ బీజేపీ అభ్యర్థి కే.సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో అరగంట పాటు నిరసన కార్యక్రమం జరిగింది.