జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందన్న మాటే కానీ.. పార్టీల హడావిడి మాత్రం తగ్గలేదు. ఓటింగ్ జరిగే సమయంలో, పూర్తయిన తర్వాత.. అన్ని పార్టీలు సీక్రెట్ గా సర్వేలు నిర్వహించాయి. ఏయే డివిజన్లలో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి, ఎంతమంది పోలింగ్ బూత్ లకు వెళ్లారనే విషయాలను లెక్క తీశారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఫలితాలపై ఆయన చాలా సంతృప్తికరంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నామో.. ఫలితాల తర్వాత కూడా అంతే సంతోషంగా ఉంటామని, గ్రేటర్ పీఠం మనదేనని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది