స్థానికి సంస్థల ఎన్నికల్లో కాస్త అటు, ఇటు అయినా.. ఎంపీపీ, జడ్పీపీ, మున్సిపల్ చైర్మన్, నగర కమిషనర్ల స్థానాలు అధికార పార్టీకే సొంతం అవుతుంటాయి. ప్రలోభాల వల ఎలాగూ ఉండనే ఉంటుంది, ఆ స్థాయి కూడా దాటితే అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల అండ కూడా ఉంటుంది. అందుకే అధికార పార్టీలు అంత ధీమాగా ఉంటాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఏదైనా తేడా కొడితే ఎక్స్ అభిషియో సభ్యుల అండతో గట్టెక్కాలని చూస్తోంది టీఆర్ఎస్.