గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తర్వాత టీఆర్ఎస్ కాస్త ధీమాగా కనిపిస్తుంటే.. బీజేపీ మాత్రం బేలగా మాట్లాడుతోంది. బీజేపీ నేతలు, సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోలింగ్ సరళిపై పెదవి విరిచారు. ముఖ్యంగా పోలింగ్ శాతం తగ్గడాన్ని ఆయన అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ వల్లే పోలింగ్ శాతం తగ్గిందని, తగ్గిన పోలింగ్ శాతం వారికి అనుకూలంగా ఉందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అంటే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కే మద్దతిచ్చినట్టు పరోక్షంగా సంజయ్ చెబుతున్నట్టుంది.