రోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. రహదారులు అన్ని రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. కౌశాంబి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు.