కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్‌తో బీజేపీకి చెందిన మరో నేత కన్నుమూశారు. కోవిడ్-19 బారినపడ్డ రాజ్యసభ సభ్యుడు, గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత అభయ్ భరద్వాజ్ (66) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.